పుట్టింది ఒక చిన్న పల్లె (నాయునివారి పల్లి, దుద్యాల గ్రామం, రాయచోటి తాలూక, కడప జిల్లా)లో తరువాత నాన్నగారు ఉద్యోగరీత్యా చాలా ఊర్లు మారుతూ, చివరికి బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లాలో స్తిరపడ్డాము.

నా హైస్కూలు చదువంతా బంగారుపాళ్యం, తరువాత డిప్లొమా మరియు బి.టెక్ వచ్చి తిరుపతి.

తీరా బి.టెక్ నాల్గవ సంవత్సరం లో క్యాంపస్ ఇంట్రవ్యూలో బాన్ అనే హాలండ్ కంపనీ లో ఉద్యోగమొచ్చి హైదరాబాద్ లో 3 సంవత్సరాలు పని చేసి 2000 సం|| లో అమెరికాకు వచ్చాను. అప్పటినుంచి ఇప్పుడో ఎప్పుడొ ఒక సారి గ్రీన్ కార్డు వస్తుందని ఒకే కంపనీలొ గత 6 సంవత్సరాలుగా కాలం వెల్లబోస్తున్నా…